ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఎట్టకేలకు భారత్‌లోనే జరగనుంది. గత రెండు సీజన్లలో దుబాయ్, సౌదీ అరేబియాలో నిర్వహించిన ఈ బిగ్ ఈవెంట్ ఈ సారి స్వదేశానికి తిరిగి వస్తుండటంతో క్రికెట్ అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో భారీ ఉత్సాహం నెలకొంది. బీసీసీఐ తాజాగా వేలం తేదీలను ఖరారు చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Avani Lekhara: అవనీ లేఖరాకు మరో స్వర్ణం
మినీ వేలం
ఓ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ 15న భారత్‌లో నిర్వహించనున్నారు. 2022 తర్వాత భారతదేశంలో జరుగుతున్న తొలి వేలం కావడం గమనార్హం. ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల తుది జాబితాను నవంబర్ 15, 2025 లోగా బీసీసీఐకి సమర్పించాలి.

ఐపీఎల్ 2026 (IPL 2026) కి సంబంధించి అధికారికంగా రిటెన్షన్ నియమాలు ప్రకటించనప్పటికీ.. ఇది ‘మినీ వేలం’ తరహాలో ఉంటుంది కాబట్టి, గరిష్టంగా 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, ‘ట్రేడ్’ విండో ద్వారా మరికొంత మంది ఆటగాళ్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
అధిక మొత్తం అందుబాటులో ఉండే అవకాశం
సాధారణంగా ప్రతి సంవత్సరం పర్స్ విలువ పెరుగుతుంది. ఈసారి కూడా ఫ్రాంచైజీలకు వేలంలో ఖర్చు చేసేందుకు అధిక మొత్తం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది జట్లకు మరింత మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసే వెసులుబాటునిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: