ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లతో ఐపీఎల్ 2025 సీజన్ కీలక దశకు చేరుకుంది. టోర్నమెంట్ మొదటి దశ పూర్తయిన నేపథ్యంలో, ప్లే ఆఫ్స్ రేసులో ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది. మొత్తం పది జట్లలో కేవలం రెండు జట్లను తప్పించి మిగతా జట్లు టాప్ 4లో స్థానం కోసం పోటీ పడి పడుతున్నాయి. రెండవ దశ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో పాయింట్ల పట్టికలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల స్థితి కాస్త క్లిష్టంగా మారింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందాలంటే ఈ రెండు జట్లు మిగిలిన అన్ని మ్యాచ్‌లను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఉంది. టోర్నీలో కనీసం 16 పాయింట్లు ఉండాలి అంటే, ఒక్క పరాజయమే ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ భవిష్యత్తు కోసం ఏప్రిల్ 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది.ఇక ముంబయి ఇండియన్స్ వరుసగా మూడు విజయాలతో మళ్లీ ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ముంబయి ఖాతాలో 8 పాయింట్లు ఉండగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలిస్తే 16 పాయింట్లకు చేరుకోగలదు. అదే కోల్కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే, జట్టుకు ఇప్పటివరకు కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం ఐదు గెలవాలి.

IPL 2025లో టాప్ఫోర్ కోసం గట్టి పోటీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 10 పాయింట్లు ఉన్నాయి. తదుపరి 6 మ్యాచ్‌లలో కనీసం 3 గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగలదు. ఇక గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో ఉన్నారు. వీరికి నెట్ రన్‌రేట్ కూడా మంచి స్థాయిలో ఉంది (+1.104), కాబట్టి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం పెద్ద సవాలేమీ కాదు.ఇంతవరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లు ఆడగా, మిగతా జట్లు 8 మ్యాచ్‌లు పూర్తి చేశాయి. గుజరాత్ టైటాన్స్ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, లక్నో జట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్లు వరుసగా ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ స్థానాల్లో ఉండగా, ఈ జట్లకు ప్లే ఆఫ్స్‌కి చేరుకోవాలంటే మిగిలిన ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే.
Read More : IPL 2025 : రాజస్థాన్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఐపీఎల్‌లో కలకలం