IPL 2025 టెన్షన్ ప్లే ఆఫ్ రేస్: మారుతున్న సమీకరణాలు, నాలుగు జట్లకే అవకాశాలు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 లీగ్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటివరకు 57 మ్యాచ్లు పూర్తయ్యాయి. లీగ్ దశలో ఇంకా 14 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో, ప్లే ఆఫ్ రేసులో జట్ల మధ్య టెన్షన్ నెలకొన్నది. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు టీములు పట్టుదలగా ప్రదర్శన చూపిస్తుండటంతో ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.56 మ్యాచ్ల తర్వాత గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవ స్థానంలో ఉంది, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వరుసగా 3వ, 4వ స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన మూడు జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి.
IPL 2025 ప్లే ఆఫ్ రేస్: టెన్షన్ పెరుగుతుంది, మారుతున్న సమీకరణలు
ఈ పరిస్థితుల్లో క్రికెట్ దిగ్గజాలు ప్లే ఆఫ్ రేసులో ఏ ఏ జట్లు చేరుకుంటాయో అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్‌కు చేరుకోవడం ఖాయమని లెక్కలు చెబుతున్నాయి. శుభమాన్ గిల్ జట్టు మిగతా అన్ని జట్లను అధిగమించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఆ స్థాయికి చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు కూడా మంచి ప్రదర్శనతో ప్లే ఆఫ్ రౌండ్లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా 6 మ్యాచ్లలో విజయం సాధించి, మిగిలిన మ్యాచ్లలో మంచి ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.అయితే, ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇప్పుడు రెండవ స్థానానికి దిగజారింది. మిగిలిన జట్లు పట్టుదలతో ప్రదర్శన ఇస్తున్న నేపథ్యంలో, రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ రౌండ్లో నిలబడగలుగుతుందో లేదో అనేది ఇప్పటికీ తర్జన భర్జనాలకు గురై ఉంది.
Read More : IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్