హైదరాబాద్: ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లేలా ఓటమిని మూటగట్టుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓడింది.ఈ పరాజయంతో సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో కేవలం ఆరు పాయింట్లు మాత్రమే ఉన్నాయి.ప్లేఆఫ్స్ రేసులో ఉన్నా… మిగిలిన ఐదు మ్యాచ్‌లను గెలవాల్సిన స్థితిలో ఉంది కమిన్స్ సేన. కానీ ఈ ఫామ్‌తో అది సాధ్యపడేలా కనిపించడం లేదు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ శుభారంభం అందుకుంది. ఓపెనర్ గిల్ జోరు చూపించాడు. అతను 38 బంతుల్లో 76 పరుగులు చేశాడు. గిల్, బట్లర్ 64, సుదర్శన్ 48తో మద్దతు ఇచ్చారు. ఆ ముగ్గురి ధాటికి గుజరాత్ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది.అంతటి భారీ స్కోరు తర్వాత గేమ్‌ను వదులుకోవడం అసాధ్యమే అనిపించింది.ఉనాద్కట్ మూడు వికెట్లు తీసి కాస్త నిలబడ్డాడు.రన్ ఛేస్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ అభిషేక్ ఒక్కరే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.అతను 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు.

కానీ మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు.హెడ్, ఇషాన్, క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు చిన్న స్కోర్లకే వెనుదిరిగారు.ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ సృష్టించాడు. అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.ఆఖర్లో నితీష్ కుమార్ (21 నాటౌట్), కమిన్స్ (19 నాటౌట్) కాస్త మెరుపులు చూపినా, ఆ సమయానికి గేమ్ దాదాపుగా పూర్తయ్యింది.20 ఓవర్లకు 186 పరుగులే చేసిన SRH, మరో ఓటమిని చవిచూసింది.బౌలింగ్ విభాగంలో గుజరాత్ ఆధిపత్యం కనబరిచింది. సిరాజ్, ప్రసిద్ధ్, కొట్జీ ఇద్దరేసి వికెట్లు తీసి, హైదరాబాద్ బ్యాటింగ్‌ను బొక్కబోర్లా చేశారు. స్పిన్నర్ రషీద్ మాత్రమే ఓవర్లలో తడబడినా, మిగిలిన వారు దట్టంగా నిలబడ్డారు.ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. వారి బ్యాటింగ్, బౌలింగ్ రెండూ సమతుల్యంగా ఉండడం ప్రధాన కారణం. టైటాన్స్‌కు ఇది కీలక విజయం అయింది.సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉండాలి. పైగా, జట్టులో స్థిరత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
Read Also : IPL 2025 : ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్