నేడు జరగనున్న (IND vs SL) నాలుగో మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేయాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది.
Read Also: IND vs SL: నేడు నాలుగో టీ20
బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.అనారోగ్యం కారణంగా జెమీమా రోడ్రింగ్స్ మ్యాచ్‌కు దూరమైందని, ఆమె బదులు హర్లీన్ డియోలో తుది జట్టులోకి వచ్చిందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ఇక శ్రీలంక రెండు మార్పులు చేసింది. కావ్య, రష్మికలను తుది జట్టులోకి తీసుకుంది.

భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నిలాక్షి డిసిల్వా, ఇమేశా దులానీ, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), రష్మిక సెవ్వండి, కావ్య కవింది, మల్షా షెహానీ, నిమేశ మధుషానీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: