हिन्दी | Epaper
తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20

INDvsENG: నేడు టెస్ట్ మ్యాచ్ కు వాన ఆటంకం?

Sharanya
INDvsENG: నేడు టెస్ట్ మ్యాచ్ కు వాన ఆటంకం?

ఇంగ్లాండ్‌ (England) తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో తొలి టెస్టులో టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాలతో అలరించగా, మిడిలార్డర్‌లో రిషభ్ పంత్ ఫైర్‌ఇన్నింగ్స్‌తో మైలురాళ్లను అధిగమించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 359/3తో భారీ స్కోరు నమోదు చేసి మ్యాచ్‌పై దాదాపుగా పట్టును సంపాదించింది. అయితే, రెండో రోజు ఆటపై వాతావరణం ప్రశ్నార్థకంగా మారింది.

వర్ష ముప్పు కలవరపెడుతోందా?

జూన్ 21, శనివారం నాడు ఆట సజావుగా సాగుతుందా లేదా అనే ప్రశ్న అభిమానులని కుదిపేస్తోంది. యార్క్‌షైర్‌ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, ఉదయం ఆట ప్రారంభమయ్యే సమయంలో వర్షం పడే చాన్స్ (5% అవకాశం) తక్కువగా ఉన్నప్పటికీ, లంచ్ విరామం తర్వాత పరిస్థితి మారనుంది. మధ్యాహ్నం 2 గంటలకు 56% వర్షపు సూచన ఉండగా, సాయంత్రం 3 గంటల నుంచి ఉరుములతో కూడిన వర్షానికి (49% అవకాశం) యెల్లో వార్నింగ్ జారీ చేశారు.

భారత ఆటగాళ్ల ఉత్సాహానికి బ్రేక్ పడుతుందా?

భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), జైస్వాల్ (101) అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించగా, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరి ప్రదర్శనతో భారత్ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. అయితే, వర్షం కారణంగా ఆట నిలిపివేయాల్సి వస్తే, భారత జట్టు తిరుగులేని ఆధిక్యం దిశగా సాగేందుకు అవకాశాలు తగ్గిపోతాయి.

బీబీసీ కథనం ప్రకారం, జూన్ 20న ఉదయం 10:35 గంటలకు జారీ చేసిన హెచ్చరికలో, “శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇది ఆటపై ప్రభావం చూపొచ్చు” అని పేర్కొంది. ఈ హెచ్చరిక సాయంత్రం 3 గంటల నుంచి అర్ధరాత్రి దాటి 4 గంటల వరకు వర్తిస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలున్నాయి, ఆ తర్వాత రాత్రి 8 గంటల నుంచి మళ్లీ వర్షం పుంజుకోవచ్చని తెలుస్తోంది. దీంతో, తొలి రోజు సంపాదించిన ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్న భారత జట్టు ఆశలకు వరుణుడు అడ్డుపడతాడేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Read also: KL Rahul: పంత్ కు కేఎల్ రాహుల్ సలాం.. వీడియో వైరల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870