కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌ను ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ తప్ప మిగతావారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేయగా, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 17 పరుగులు మాత్రమే సాధించాడు. జోఫ్రా ఆర్చర్ 12 పరుగులతో జట్టుకు కొంత దోహదం చేశాడు.భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెరిసి 3 వికెట్లు తీశాడు.
అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను చిత్తుచేసారు.అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత జట్టు 7 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేసి తొలి వికెట్‌గా అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు వికెట్లు ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అభిషేక్ శర్మ 29 పరుగులతో అద్భుతంగా ఆడుతున్నాడు.
అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.తిలక్ వర్మ 7 పరుగులతో అతనికి తోడుగా నిలిచాడు.ఇప్పటివరకు టీమిండియా విజయానికి ఇంకా 78 బంతుల్లో 66 పరుగులు అవసరం. అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతుండటంతో టీమిండియా విజయంపై ఆశలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ ప్రదర్శన విశేషంగా నిలిచింది. బ్యాటింగ్‌లో కూడా అభిషేక్ శర్మ ఆధ్వర్యంలో మంచి ప్రారంభం అందుకుంది. ఇక ముందు ఉన్న సవాలను టీమిండియా ఎలా తీరుస్తుందో చూడాలి.