Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయం సాధించి, తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరిసింది. జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, భారత మహిళా క్రికెటర్ల వార్షిక జీతాలపై చర్చ మళ్లీ ప్రాధాన్యత పొందుతోంది.
Read also: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి

Indian Women’s Cricket
Indian Women’s Cricket: బీసీసీఐ (BCCI) విడుదల చేసిన 2024–25 కాంట్రాక్ట్ ప్రకారం మహిళా క్రీడాకారిణులను మూడు గ్రేడ్‌లుగా విభజించారు. గ్రేడ్–ఎలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు ఏడాదికి రూ. 50 లక్షల చొప్పున జీతం లభిస్తోంది. గ్రేడ్–బి క్రీడాకారిణులు జెమీమా రోడ్రిగ్స్, రేణుకా ఠాకూర్, రిచా ఘోష్, షఫాలీ వర్మలు రూ. 30 లక్షలు, గ్రేడ్–సి క్రీడాకారిణులు రూ. 10 లక్షలు అందుకుంటున్నారు. మరోవైపు పురుషుల జట్టులో గ్రేడ్–సి క్రీడాకారులకే రూ. కోటి వేతనం లభిస్తుండగా, గ్రేడ్–ఏ+ వారికి రూ. 7 కోట్లు వరకు చెల్లిస్తున్నారు. అయితే, మ్యాచ్ ఫీజుల విషయంలో మాత్రం బీసీసీఐ సమాన విధానం పాటిస్తోంది — టెస్ట్‌కు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20కు రూ. 3 లక్షలు ఇరు జట్లకు ఒకే విధంగా చెల్లిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: