हिन्दी | Epaper

బంగ్లాకు ముచ్చెమటలు పట్టిస్తున్న భారత బౌలర్లు

Sharanya
బంగ్లాకు ముచ్చెమటలు పట్టిస్తున్న భారత బౌలర్లు

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం కొనసాగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన భారత్, ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడాలని చూస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కు తొలి నుంచే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అది కూడా రెండు ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది.

vh0lapsg team india bcci 625x300 06 October 24

షమీ దెబ్బకు మరో వికెట్ కోల్పోయిన బంగ్లా:

మొదటి ఓవర్లోనే మహ్మద్ షమీ బంగ్లా బ్యాటింగ్‌కు తొలి షాక్ ఇచ్చాడు. తన ఆట ప్రారంభంలోనే ఓపెనర్‌ను పెవిలియన్ పంపించాడు. ఇక రెండో ఓవర్లో హర్షిత్ రాణా అదరగొట్టాడు. తన ధాటికి మరో వికెట్ కోల్పోయిన బంగ్లా ఒత్తిడిలో పడింది. రెండు వికెట్లు పడిపోయిన తర్వాత బంగ్లా బ్యాటర్లు కాసేపు నిలదొక్కుకున్నట్లు కనిపించినా, షమీ మరోసారి దాడి చేసి బంగ్లా ఆశలకు గండికొట్టాడు. మెహదీ హసన్ మీరాజ్‌ను పెవిలియన్ పంపించి మూడో వికెట్ తీశాడు.

అనంత‌రం బౌలింగ్ కి దిగిన అక్ష‌ర్ ప‌టేల్ త‌న తొలి ఓవ‌ర్ లోనే రెండు వికెట్లు తీసి, బంగ్లా టైగ‌ర్స్ ను పీక‌లోతు క‌ష్టాల్లోకి నెట్టేశాడు. దీంతో ప్రత్య‌ర్థి జ‌ట్టు 35 ప‌రుగుల‌కే 5 కీల‌క వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో సౌమ్య స‌ర్కార్‌, కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ డ‌కౌట్ అయ్యారు. ప్ర‌స్తుతం క్రీజులో తౌహిద్ హృదయ్ (10 బ్యాటింగ్), జాకర్ అలీ (6 బ్యాటింగ్) ఉండ‌గా బంగ్లాదేశ్ స్కోరు 49/5 (12 ఓవ‌ర్లు). జాకర్ అలీ (6 బ్యాటింగ్) నిలబడి ఉన్నప్పటికీ, భారీ స్కోరు సాధించేందుకు ఆస్కారం కనిపించడం లేదు. భారత బౌలింగ్ దాడిని తట్టుకొని బంగ్లా బ్యాటర్లు పుంజుకుంటారా? లేక త్వరలోనే ఆల్‌అవుట్ అవుతారా అనేది చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

కేటీఆర్ చేతుల మీదుగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

అహ్మదాబాద్‌లో టికెట్ల బ్లాక్ దందా.. ఇద్దరు అరెస్ట్!

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

టీమిండియానే ఫేవరెట్.. కానీ! ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

నేడే ఫైనల్.. విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

వరుణ్‌పై ఆందోళన వద్దు, అతడు వరల్డ్ నంబర్ 1: సూర్య

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం ప్రత్యేకమైన అనుభూతి

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ముందు షాక్? సూర్య రిటైర్మెంట్ వార్తలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్ హోటల్ రేట్లకు రెక్కలు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు, భారత్ vs న్యూజిలాండ్

ఆస్ట్రేలియా ఆలౌట్

ఆస్ట్రేలియా ఆలౌట్

📢 For Advertisement Booking: 98481 12870