
భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు (India Women’s Blind Cricket team) చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి అంధులు టీ20 మహిళా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, పాకిస్తాన్ , శ్రీలంక, అమెరికా వంటి జట్లు కూడా పాల్గొన్నాయి.టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్‌ను ముద్దాడింది.
Read Also: Nara Lokesh: టీ20 ప్రపంచ కప్ విజేతగా అంధుల మహిళల జట్టు..అభినందనలు తెలిపిన నారా లోకేశ్
ఫైనల్‌కు భారత్
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ (India Women’s Blind Cricket team) తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు నేపాల్ బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి నేపాల్ జట్టు 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఖులా షరీర్ 27 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 44 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
నవంబర్ 11న ఢిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, అమెరికా జట్లు పాల్గొన్నాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరింది. ఈ చారిత్రక విజయం దేశంలో అంధుల క్రికెట్‌కు మరింత గుర్తింపు, ప్రోత్సాహం లభించడానికి మార్గం సుగమం చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
కళ్లకు గంతలు ధరించడం తప్పనిసరి
ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. కనీసం నలుగురు ఆటగాళ్ళు పూర్తిగా అంధులుగా (B1 కేటగిరీ) ఉండాలి. ఆటలో పారదర్శకత కోసం ఆటగాళ్లందరూ కళ్లకు గంతలు ధరించడం తప్పనిసరి. B1 కేటగిరీ ఆటగాడు చేసిన ప్రతి పరుగును రెండు రెట్లు (డబుల్) లెక్కించడం ఈ ఆటలో ఒక ప్రత్యేకత.
ఫీల్డర్లు తమ స్థానాలను ఇతరులకు తెలియజేయడానికి ఒకసారి చప్పట్లు కొడతారు. ఈ చారిత్రక విజయం దేశానికి గర్వకారణం. భారత మహిళా అంధ క్రికెట్ జట్టు సాధించిన ఈ విజయం దేశంలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంచింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: