మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆరోమ్యాచ్లోలో భారత్ మహిళల(India Women Cricket Team) జట్టు పాక్ జట్టును చిత్తుగా ఒడించింది. భారత్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసారు.తదనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో 88 పరుగుల తేడాతో భారత్ మహిళా జట్టు విజయం సాధించి నట్లయింది.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా భారత్ జట్టులో క్రాంతిగౌడ్ ఎంపికయింది. 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన గౌడ్ను ప్లేయర్ ఆఫ్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికచేసారు.దీనితో మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ జట్టు రెండో విజయం సాధించింది. తొలిపోరులో శ్రీలంకకు షాకిచ్చిన టీమిండియా, ఈసారి పాకిస్తాన్ను కూడా మట్టికరిపించింది.బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో పోరాడగలిగే స్కోరు చేసిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్సేన ఆ తర్వాత బ్యాటింగ్లో పాక్ జట్టును చిత్తుచేసింది.
ఓటమి పై పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?
పాక్ జట్టుకు ఎదురుదెబ్బ
క్రాంతి గౌడ్ 20 పరుగులకు మూడు వికెట్లు, స్నేహిరాణా 38 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. దీప్తిశర్మ 45 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసింది. చివరి వికెట్ కూడా దీప్తిచే టౌన్ కావడంతో 88 పరుగుల తేడాతో భారత విజయం సాదించింది.ఈ ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థిపై 12 విజయాలతో భారత్ జట్టు(India Women Cricket Team) పైచేయి సాధించింది.వరల్డ్ కప్ వేటలో హర్లీన్ డియోల్ 46, తొలి రీచాఘోష్ 35 పరుగులు నాటౌట్‌గా నిలిచారు.ఛేదనలో తొలినుంచి తడబడిన పాక్ జట్టు ఏదశలోనూ భారత్ను అధిగమించలేకపోయింది. మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ ఫాతీమా సనా మాట్లాడుతూ 200 పరుగుల వద్ద కట్టడిచేయాలనుకున్నామని, టాప్ ఐదు స్థానాల్లో స్పెషలిస్టు బ్యాటర్లతో వెళ్లాలని నిర్ణయించుకున్నా కొంత వెనకబడ్డామని ప్రకటించింది.మొత్తంగా చూసితే, 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. సిద్రా అమీన్ 81 పరుగులతో చివరివరకు పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు కూడా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు.
Read Also: