India vs South Africa T20 : కట్టాక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు క్లినికల్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను కేవలం 74 పరుగులకే ఆలౌట్ చేసి, 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇది టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్‌గా నమోదైంది.
మ్యాచ్ ఆరంభంలో దక్షిణాఫ్రికా కొంచెం ఆశాజనకంగా కనిపించినప్పటికీ, భారత బౌలర్లు క్రమంగా పట్టు సాధించి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా కూల్చేశారు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించారు. ఆయన 100వ టీ20 వికెట్‌ను సాధించిన సందర్భంలో నోబాల్ వివాదం నెలకొన్నప్పటికీ, థర్డ్ అంపైర్ అది చెల్లుబాటు అయ్యే బంతేనని ప్రకటించాడు. ఆ ఓవర్‌లోనే మరో వికెట్ కూడా తీయడంతో దక్షిణాఫ్రికా భారీ ఒత్తిడిలో పడింది.
Read Also: TG Holidays List: 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల
అనంతరం అక్షర్ పటేల్ మరో వికెట్‌ను తీసి దక్షిణాఫ్రికాను చివరి వికెట్ దశకు నెట్టాడు. మొత్తంగా భారత బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది.
అంతకుముందు బ్యాటింగ్‌లో భారత్ తడబడిన దశలో (India vs South Africa T20) హార్దిక్ పాండ్యా అసాధారణ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. కేవలం 28 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేసిన పాండ్యా, భారత్‌కు పోరాడే స్కోర్ అందించారు. శుభ్‌మన్ గిల్ మూడో బంతికే ఔట్ కావడంతో భారత్ ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడినా, పాండ్యా అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
ఈ విజయం ద్వారా భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించి, దక్షిణాఫ్రికాపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: