భారత క్రికెట్‌లో టాలెంట్ ఉన్నా అవకాశం దక్కడం ఎంత కష్టమో చెప్పే ఉదాహరణ సంజూ శాంసన్. దేశీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ (IPL) వరకు ప్రతి సీజన్‌లోనూ రాణిస్తూ, తన ప్రతిభను నిరూపించుకున్నా కూడా, భారత జట్టులో స్థానం మాత్రం సులభంగా రాలేదు. ప్రతిసారి ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన తరువాత కూడా, “ఈ సారి అయినా టీమిండియా డోర్లు తెరిస్తుందేమో” అనే ఆశతో కళ్లల్లో కలలు కట్టి ఎదురు చూశాడు.
కొన్నిసార్లు సంజూ (Sanju Samson) కి జాతీయ జట్టులో స్థానం దక్కినా, ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కేది కాదు. ఒకవైపు యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ, మరోవైపు అనుభవజ్ఞులైన ప్లేయర్లతో పోటీ చేయడం వల్ల అతని మార్గం మరింత కఠినమైంది. ఫలితంగా అతను ఆడే అవకాశం రాకపోయినా, తన ఆటతీరును మెరుగుపరుచుకోవడంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

టెస్టు, వన్డేలకు పరిమితం చేయడంతో
టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రోహిత్, కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడం రిషబ్ పంత్‌ను టెస్టు, వన్డేలకు పరిమితం చేయడంతో సంజూకి అవకాశం దొరికింది.సంజూ శాంసన్ తనకు దొరికిన అదృష్టాన్ని నిరూపించుకుని టీమిండియా (Team India) లో నిలబడ్డాడు. టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన కేవలం 12 నెలల్లోనే మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.
టీమిండియా తరఫున వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉండి ఇప్పటి వరకు ఇన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడు మరొకడు లేడు. ది గ్రేట్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కి కూడా సాధ్యం కాని ఈ రికార్డును సంజూ అందుకున్నాడు.అబూదాబీ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన సంజూ శాంసన్ టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఓపెనర్‌గా సక్సెస్
5 బంతులు ఆడిన సంజూ శాంసన్ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 188 పరుగులు చేయగా, ఒమన్ 167 పరుగులు చేయడంతో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఇప్పటి వరకు టీమిండియా తరఫున 45 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 39 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. మూడు సెంచరీలు కూడా గడిచిన రెండు, మూడు సీజన్లలోనే చేయడం విశేషం.
వన్డేల్లో మాత్రం కేవలం 16 మ్యాచ్‌లలోనే అవకాశం దక్కింది.ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా స్క్వాడ్‌లో చోటు దక్కినా ప్లేయింగ్ 11లో ఆడిస్తారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఓపెనర్‌గా సక్సెస్ అయిన సంజూ స్థానంలో శుభమన్ గిల్ (Shubham Gill) రావడంతో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యూఏఈ, పాకిస్తాన్‌పై బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. కానీ ఒమన్‌పై మూడో స్థానంలో బరిలోకి దిగి హాఫ్ సెంచరీతో అదరగొట్టి మరొకసారి తనను తాను నిరూపించుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: