हिन्दी | Epaper

India vs Australia Women’s Test Score: ఆస్ట్రేలియా ఆలౌట్

Anusha
India vs Australia Women’s Test Score: ఆస్ట్రేలియా ఆలౌట్

India vs Australia: భారత మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాపై 125 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అన్నాబెల్ సదర్లాండ్(129) శతకంతో అదరగొట్టింది. ఎలీస్ పెర్రీ(76) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్ సయాలీ సత్ఘరే అరంగేట్రంలో ఔరా అనిపించింది. ఏకంగా 4 వికెట్లు తీసి ఆసీస్‌ను కాస్త కట్టడి చేయగలిగింది.

Read Also: Khelo India Tribal Games: ఈనెల 25 నుంచి ఖేలో ఇండియా ట్రైబల్‌ గేమ్స్‌

స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ తలొక వికెట్ పడగొట్టారు

తొలి సెషన్‌లో భారత్ 198 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.తొలి సెషన్‌లో ఆసీస్ బ్యాటర్లు సదర్లాండ్, పెర్రీ మినహా ఇతర ప్లేయర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. జార్జియా వాల్(2), ఫోబ్ లిచ్‌ఫీల్డ్(9), అలీసా హీలీ(13), బెత్ మూనీ(19), ఆష్లీ గార్డ్‌నర్(1), మెక్ గ్రాత్(13), అలానా కింగ్(21), లూసీ హమిల్టన్(23) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో సయాలీ 4, క్రాంతి గౌడ్ 2, దీప్తి శర్మ 2, స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ తలొక వికెట్ పడగొట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870