Vaibhav Suryavanshi : బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన అండర్-19 మూడో మరియు చివరి యూత్ వన్డేలో యువ భారత్ దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా యువజట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక 35 ఓవర్లలోనే 160 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత కెప్టెన్ Vaibhav Suryavanshi అద్భుత ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపించాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 127 పరుగులు చేసిన వైభవ్, బౌలింగ్‌లో కూడా ఒక కీలక వికెట్ పడగొట్టాడు. మరోవైపు ఆరోన్ జార్జి 106 బంతుల్లో 16 ఫోర్లతో 118 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా టాప్-4 బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. పాల్ జేమ్స్ (41), డేనియల్ బోస్మాన్ (40), కార్న్ బోథా (30 నాటౌట్) మాత్రమే కొంత ప్రతిఘటన చూపించారు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 3 వికెట్లు, మహమ్మద్ ఎనాన్ 2 వికెట్లు పడగొట్టారు. మిగతా వికెట్లను హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, అంబరీష్, వైభవ్ సూర్యవంశీ తీశారు.

ఈ సిరీస్‌లో అద్భుత ఆటతీరుతో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: