India U19 World Cup : అండర్-19 వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా మూడో గెలుపు నమోదు చేసిన భారత్, గ్రూప్ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను డీఎల్‌ఎస్ పద్ధతిలో కుదించారు.
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ Ayush Matre ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడికి కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు 36.2 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్ఎస్ అంబరీష్ 4 వికెట్లు, హెనిల్ పటేల్ 3 వికెట్లు తీసి సత్తా చాటారు.
Read Also: Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అనంతరం వర్షం కారణంగా భారత్‌కు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించారు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 13.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే 27 బంతుల్లో 53 పరుగులతో మెరుపు అర్ధశతకం సాధించి జట్టును ముందుండి నడిపించాడు. వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: