భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య జరగనున్న సిరీస్ పై ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్ నెలలో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (3 వన్డేలు, 3 టీ20లు) రద్దైనట్లు తెలుస్తోంది.
Read Also: Puttaparthi: పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సచిన్, ఐశ్వర్యరాయ్

మూడు టీ20లు ఆడాల్సి ఉంది
బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అలానే కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్‌లో కూడా భారత్, బంగ్లాదేశ్ (IND VS BAN) జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది.
ఆగస్టులో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌కు మార్చారు. మొత్తంగా మహిళల సిరీస్ రద్దుకావడంతో బంగ్లాదేశ్ కు బిగ్ షాక్ తగిలినట్లే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: