हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: IND vs SL: నేడే భారత్, శ్రీలంక మ్యాచ్

Anusha
Latest News: IND vs SL: నేడే భారత్, శ్రీలంక మ్యాచ్

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భాగంగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లలో చివరి పోరు ఈ రోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్‌లో జరగనుంది. ఇప్పటికే భారత్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నా, ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సత్తా చాటుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక శ్రీలంక విషయానికొస్తే, టోర్నీ సెమీ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో గెలిచి గౌరవప్రదంగా బయటకు రావాలని సంకల్పించింది.

 Sunil Gavaskar: ఐపీఎల్‌లో ఆ జట్టు తరుపున ఆడాలనుకుంటున్నా: గవాస్కర్

ఈ సందర్భంలోనే శ్రీలంక మాజీ కెప్టెన్, జట్టులో కీలక ఆటగాడైన దసున్ శనక (Dasun Shanaka) బలమైన ప్రకటన చేశాడు.భారత్ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ శ్రీలంక వెనకడుగు వేయదని అన్నారు. శ్రీలంక ప్రయాణం అనుకున్న దానికంటే ముందే ముగిసినప్పటికీ.. తమ జట్టుకు ఇంకా చాలా చేయగలిగే సామర్థ్యం ఉందని మాజీ కెప్టెన్ దసున్ శనక వెల్లడించారు.

దుబాయ్‌లో భారత్‌తో జరిగే తమ చివరి సూపర్-4 మ్యాచ్‌కు ముందు దసున్ శనక మాట్లాడుతూ.. డిఫెండింగ్ టీ20 ఆసియా కప్ ఛాంపియన్‌ (T20 Asia Cup Champion) గా తమ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి తమ జట్టు దృఢ నిశ్చయంతో ఉందని చెప్పారు. భారత్‌కు హెచ్చరిక జారీ చేస్తూ దసున్ శనక ఇలా అన్నారు. “భారత్ అత్యుత్తమ జట్టు అయినప్పటికీ, శ్రీలంక వెనుకడుగు వేయదు. టీ20 ప్రపంచ కప్‌కు ముందు తమను తాము నిరూపించుకోవడానికి ఇది మాకు మంచి అవకాశం.” అని శనక అన్నారు.

టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన చరిత్ అసలంక

టీమిండియా ఇప్పటికే ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడటం ఖాయం కావడంతో.. శ్రీలంకతో జరిగే తమ చివరి సూపర్-4 మ్యాచ్‌లో పాయింట్లు లేదా క్వాలిషికేషన్ గురించి భారత జట్టుకు చింత లేదు. శుక్రవారం శ్రీలంకతో జరిగే ఈ మ్యాచ్.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) జట్టుకు కేవలం ఫలితం కోసమే కాదు.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు తమ లయ, ఆత్మవిశ్వాసం, లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది.

IND vs SL
IND vs SL

ఇక శ్రీలంక విషయానికొస్తే.. వారికి మిగిలింది కేవలం ఆత్మగౌరవం మాత్రమే. వరుసగా రెండు ఓటముల తర్వాత టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన చరిత్ అసలంక (Charit Asalanka) సేన దుబాయ్ నుంచి నిరాశతో తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదు. భారత్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక ఆటగాడు దసున్ శనక.. భారత్ ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రత్యర్థి అని అంగీకరించారు.

దురదృష్టవశాత్తు టోర్నమెంట్ నుంచి బయట ఉన్నాం

కానీ వెంటనే శ్రీలంక కూడా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. “మేము ఒక మంచి మ్యాచ్ ఆశిస్తున్నాం. మేము మా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. మేము ఇంకా చాలా మంచి జట్టే.. కానీ దురదృష్టవశాత్తు టోర్నమెంట్ నుంచి బయట ఉన్నాం. కానీ మా ముందు ప్రపంచ కప్ ఉంది, కాబట్టి భారత్‌తో ఈ పోరు ఒక మంచి మ్యాచ్ అవుతుంది.

అందుకే దుబాయ్ నుండి వెళ్లే ముందు ఈ పోటీలో తమను తాము నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఉంది” అని దసున్ శనక అన్నారు.సూర్యకుమార్ యాదవ్ ఫామ్ సరిగా లేనప్పటికీ, అతను ఒక పెద్ద మ్యాచ్ ప్లేయర్ అని దసున్ శనక అభివర్ణించారు. దీనితో పాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుతమైన ప్రదర్శనను ఆయన ప్రశంసించారు. అభిషేక్ శర్మ ఐపీఎల్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని ఆయన అన్నారు.

బ్యాటింగ్ ఎక్కువగా అభిషేక్ శర్మ చుట్టూనే తిరుగుతోంది

భారత బ్యాటింగ్ ఎక్కువగా అభిషేక్ శర్మ చుట్టూనే తిరుగుతోంది. అతను 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 248 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. అతడితో పాటు సంజు శాంసన్ ఇబ్బంది పడ్డాడు. తిలక్ వర్మ, శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ పరుగులు చేశారు. కాగా కెప్టెన్ సూర్యకుమార్ నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870