ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా (రేపు) మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా (IND vs SA) అమీతుమీ తేల్చుకోనున్నాయి. స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియా మరింత పటిష్ఠంగా మారింది. ఈ సిరీస్ (IND vs SA) ద్వారా వరల్డ్ కప్ జట్టు కూర్పుపై ఓ స్పష్టతకు రావాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
Read Also: Gautam Gambhir: హర్షిత్ రాణాకు మద్దతుపై స్పష్టతనిచ్చిన గంభీర్
అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు
గాయం కారణంగా దాదాపు నెల రోజులు ఆటకు దూరమైన గిల్, ఆసియా కప్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం జట్టుకు ఎంతో శుభదాయకం. గిల్ రాకతో యువ సంచలనం అభిషేక్ శర్మతో కలిసి మరోసారి పటిష్ఠమైన ఓపెనింగ్ జోడీ బరిలోకి దిగనుంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు దేశవాళీ టి20 టోర్నీలో అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

హార్దిక్ రాకతో బ్యాటింగ్ డెప్త్‌తో పాటు బౌలింగ్ విభాగంలోనూ సమతుల్యం ఏర్పడుతుంది.ఇక దక్షిణాఫ్రికా జట్టులోకి స్టార్ పేసర్ అన్రిచ్ నోర్కియా తిరిగి వచ్చాడు. గాయాల కారణంగా ఆ జట్టు కీలక ఆటగాళ్లు టోనీ డి జోర్జి, క్వెనా మఫాకా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఫిబ్రవరిలో ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, దానికి ముందు భారత్ దక్షిణాఫ్రికాతో 5, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: