हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: IND vs SA: కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ 124

Anusha
Latest News: IND vs SA: కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా టార్గెట్ 124

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ (IND vs SA) మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ పూర్తిగా పతనమైంది. మూడో రోజు ఆటలో ప్రోటీస్ జట్టు కేవలం 153 పరుగులకే ఆలౌట్ అవడంతో, భారత్ జట్టుకు 124 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. ఆదివారం మ్యాచ్ లో మూడో రోజు  దక్షిణాఫ్రికా నేడు 93/7 వద్ద ఆటను తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలో మరో 60 పరుగులు జోడించింది.

Read Also: Shubhman Gill: గిల్ గాయంపై బీసీసీఐ క్లారిటీ

కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25) పర్వలేదనిపించాడు. మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్‌కు చెరో వికెట్ దక్కింది.

124 పరుగుల లక్ష్యాన్ని చేధించడం టీమిండియాకు అంత సులువేం కాదు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌‌కు అనుకూలిస్తోంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పైగా గిల్ గాయంతో దూరమవడంతో భారత్ 9 మందితోనే బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

టెంబా బవుమా 122 బంతుల్లో హాఫ్ సెంచరీ

93/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు టెంబా బవుమా, కార్బిన్ బోష్(25) ఆచితూచి ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఓవర్‌నైట్ స్కోర్‌కు 42 పరుగులు జోడించి క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జస్‌ప్రీత్ బుమ్రా విడదీసాడు.

స్టన్నింగ్ డెలివరీతో కార్బిన్ బోష్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.క్రీజులోకి వచ్చిన సిమన్ హర్మర్ సాయంతో టెంబా బవుమా 122 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బవుమాకు అండగా నిలిచిన సిమన్ హర్మర్(7)ను స్టన్నింగ్ డెలివరీతో మహమ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని వేగం ధాటికి ఆఫ్ స్టంప్ మధ్యలోకి విరిగిపోయింది.ఇదే ఓవర్ ఆఖరి బంతికి స్టన్నింగ్ యార్కర్‌తో కేశవ్ మహరాజ్‌(0)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870