భారత్–దక్షిణాఫ్రికా (IND Vs SA) మధ్య కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ఇరు జట్ల తుది ఎలెవన్‌లను ప్రకటించగా, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న కీలక నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Read Also: IND vs SA: సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
వరుసగా 8 టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోవడంపై శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సరదాగా స్పందించాడు. తాను గెలిచే ఏకైక టాస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లోనే అవుతుందేమోనని అన్నాడు. కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ, ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మా కుర్రాళ్లు ఇటీవలే పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చారు. నేను ఏ జట్టుతో ఇక్కడ ఆడాను.
ఈ సిరీస్ కోసం మేం బాగానే సన్నదమయ్యాం. ఈ మ్యాచ్ చూసేందుకు 50-60 వేల మంది రావడం కనువిందుగా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ (World Test Champion) గా ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నా. మా టైటిల్ నిలబెట్టుకున్నేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ప్రదర్శన పరంగా మా జట్టుకు తిరుగులేదు.

పిచ్ పొడిగా కనిపిస్తుంది. గడ్డి ఎక్కువగా లేదు. ఇది విభిన్నమైన భారతీయ వికెట్. తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం ముఖ్యం. పక్కటెముక గాయం కారణంగా రబడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో కార్బిన్ బోష్ ఆడుతున్నాడు.’అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సిమోన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభమాన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: