సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA) ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వైజాగ్ వేదికగా శనివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, 9 వికెట్ల తేడాతో అలవోకగా ఛేదించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Read Also: IND vs SA: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. ముగ్గురు ప్లేయర్లు ఔట్
నిర్ణయాత్మక మూడో వన్డేలో (IND vs SA) టీమిండియా ముందు దక్షిణాఫ్రికా 271 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్, జైశ్వాల్ జోడీ.. రన్ ఛేజ్‌ను ఏకపక్షంగా మార్చింది. ఈ సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని..జైశ్వాల్ సెంచరీతో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ.. హాఫ్ సెంచరీ కొట్టాడు.
వన్ డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ.. పరుగుల వరద కంటిన్యూ చేశాడు. అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు.తొలుత నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన జైశ్వాల్.. చివర్లో వేగం పెంచాడు. 111 బంతుల్లో మూడంకెల మార్కు అందుకున్నాడు. 23 ఏళ్ల జైశ్వాల్‌కు ఇది నాలుగో వన్డే మ్యాచ్ కాగా తొలి వన్డే శతకం సాధించాడు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేశాక ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టీ20 తరహాలో సత్తాచాటాడు.

కోహ్లీ లాంటి సీనియర్ల రాక
40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. మరో 5 బంతుల్లో మరో 15 పరుగులు స్కోరు చేశాడు. జైశ్వాల్.. 121 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ 45 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో టీమిండియా 39.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
దీంతో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కానీ తాజాగా రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ల రాకతో భారత్.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: