భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ రద్దయింది. అధిక పొగమంచు కారణంగా మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అనంతరం, మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్ ఈ నెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
Read Also: Gill Injury: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు శుభ్‌మన్ గిల్ దూరం

2 – 2తో సమం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా లక్నో వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా జట్లకు చాలా కీలకం కావడంతో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకునే అవకాశం ఉండగా, సౌతాఫ్రికా విజయం సాధిస్తే సిరీస్‌ను 2 – 2తో సమం చేసుకునే ఛాన్స్ దక్కేది. కానీ, ఊహించని విధంగా పొగమంచు కమ్మేయడంతో అర్ధంతరంగా మ్యాచ్ నిలిచిపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: