భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 124 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమై 93 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో ఆ జట్టు స్పిన్నర్ సైమన్ హార్మర్ కీలక పాత్ర పోషించారు.
Read Also: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

గౌహతి టెస్ట్ ప్రారంభానికి ముందు సైమన్ హార్మర్ ఆస్పత్రి పాలయ్యాడు
తన అద్భుతమైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి హార్మర్ మొత్తం 8 వికెట్లు తీశారు. అందుకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే గౌహతి టెస్ట్ (IND vs SA 2nd Test) ప్రారంభానికి ముందు సైమన్ హార్మర్ ఆస్పత్రి పాలయ్యాడు. ఓ నివేదిక ప్రకారం, హార్మర్‌కు భుజానికి గాయం అయ్యింది.
ఈ గాయం ఎంత తీవ్రమైనదో ఇంకా తెలియరాలేదు. తదుపరి వైద్య పరీక్షల కోసం మంగళవారం నాడు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి భారత్‌తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ (IND vs SA 2nd Test) కు హార్మర్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్ సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా హార్మర్‌కు గాయమైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: