ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భారత జట్టు ప్రదర్శనతో సూపర్ ఫోర్ దశలో అడుగు పెట్టిన సంగతి ప్రేక్షకులు, క్రికెట్ వర్గాల్లో హర్షం కలిగించింది. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు అప్రతిహత రీతిలో గెలిచి, సూపర్ ఫోర్ దశలోకి చేరింది. గెలుపు ఫలితమే కాక, మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సమయంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) భారత కెప్టెన్‌ను ప్రశ్నించాడు, “ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నారా?” దీనికి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఎంతో తెలివిగా, కానీ స్పష్టంగా, పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా సమాధానమిచ్చారు. ఆయన చెప్పింది: “మేం సూపర్ ఫోర్స్‌కు సిద్ధంగా ఉన్నాం.” ఈ సమాధానం ప్రేక్షకుల్లో, మీడియా వర్గాల్లో పెద్ద ఆసక్తిని కలిగించింది.
ఆ జట్టు పేరును చెప్పేందుకు సైతం
ఒమన్‌తో మ్యాచ్ అనంతరం.. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌పై మీడియా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశ్నించింది. అయితే, తాము సూపర్ 4 కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా ఆ జట్టు పేరును చెప్పేందుకు సైతం ఇష్టపడలేదు.

గ్రూప్ స్టేజ్‌లో పాక్‌తో మ్యాచ్ రోజున కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha)తో కరచాలనం చేయకపోవడం పోవడం తెలిసిందే. దాంతో పెద్ద వివాదమే చెలరేగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత సైతం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు.
కొంచెం కష్టంగా ఉంటుందన్నాడు
ఈ సందర్భంగా ఒమన్ జట్టును టీమిండియా కెప్టెన్ అభినందించారు. ఒమన్ భారత బౌలర్లను బాగా ఎదుర్కొన్నారంటూ బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించాడు. సూర్య మాట్లాడుతూ రాబోయే మ్యాచ్‌లో తప్పనిసరిగా తాను టాప్ ఆర్డర్ (Top order) లోనే బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒమన్ అద్భుతమైన క్రికెట్ ఆడిందని తాను భావిస్తున్నానన్నాడు.
వారి బ్యాటింగ్ చేయడం చూడటం నిజంగా బాగుందన్నాడు. అయితే, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా గురించి మాట్లాడుతూ బెంచ్‌పై కూర్చొని అకస్మాత్తుగా జట్టులోకి వచ్చిన తుదిజట్టులోకి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒమన్ ఆటగాళ్లతో మాట్లాడి వారిని కౌగిలించుకున్నాడు. హార్దిక్ కూడా అలాగే చేస్తూ కనిపించాడు. సూర్యకుమార్ ప్రత్యర్థి జట్టు సభ్యులతో ఫొటోలు దిగడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: