ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్ (IND Vs NZ)లో సమష్టిగా చెలరేగిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. సొంత గడ్డపై భారత్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో పలు ప్రయోగాలకు దిగింది. ఈ ఓటమి తమకు ఒక గొప్ప పాఠమని, రాబోయే ప్రపంచకప్‌కు సిద్ధమవ్వడంలో భాగంగానే తాము ఉద్దేశపూర్వకంగానే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
Read Also: Vizag 4th T20 match:అభిషేక్ శర్మ మరో గోల్డెన్ డక్
ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వడం మా ప్రాధాన్యం
మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడుతూ.. “మేము ఈ రోజు కావాలనే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు పక్కా బౌలర్లతో ఆడాము. 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు, ఆరంభంలోనే వికెట్లు పడితే మిగిలిన వారు ఎలా ఆడతారో పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. వరల్డ్ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వడం మా ప్రాధాన్యం” అని పేర్కొన్నారు.

మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, శివమ్ దూబే వీరోచిత పోరాటంపై సూర్య ప్రశంసలు కురిపించాడు. “దూబే అద్భుతంగా ఆడాడు. ఆ సమయంలో అతనికి తోడుగా మరో బ్యాటర్ నిలబడి ఉంటే ఫలితం కచ్చితంగా మారిపోయేది. 50 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, భారీ లక్ష్యాలను ఎలా ఛేదించాలనే విషయంలో మాకు స్పష్టత వచ్చింది. మళ్లీ అవకాశం వస్తే ఛేజింగ్‌కే మొగ్గు చూపుతాం” అని తన వ్యూహాన్ని వివరించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: