ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి (IND vs AUS) వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ఓడిపోయాడు.. వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా ఇది శుభ్‌మన్ గిల్‌కు వరుసగా మూడవ మ్యాచ్, శుభ్‌మన్ గిల్‌కు టాస్ కలిసి రాలేదు. మరోవైపు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ (Pitch conditions) నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
Ravi Shastri: విరాట్ త్వరగా తన ఫామ్ ను పెంచుకోవాలి: రవిశాస్త్రి
సిరీస్‌లో టాస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh), బ్యాటింగ్‌ను ముందుగా ఎంచుకున్నారు. టాస్ గెలిచిన వెంటనే ఆయన మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం, “మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మా కుర్రాళ్లు ఇప్పటికే అద్భుత ప్రదర్శన కనబరిస్తున్నారని భావిస్తున్నాము.
ఇది మాకు గొప్ప సంకేతం. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు ఇది మాకు మంచి అవకాశం ఇస్తుంది” గ్జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో నాథన్ ఎల్లిస్ జట్టులోకి వచ్చాడు అని పేర్కొన్నారు.మరోవైపు తాము టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తెలిపాడు. టాస్ ఓడినా తాము కోరుకున్నదే దక్కినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు.
ఏది ఏమైనా మేం మెరుగైన ప్రదర్శనే చేశామన్నాడు
గత మ్యాచ్‌లో పోరాడే లక్ష్యం ఉన్నా.. విజయవకాశాలను అందిపుచ్చుకోలేకపోయామని చెప్పాడు. ఏది ఏమైనా మేం మెరుగైన ప్రదర్శనే చేశామన్నాడు. తాజా మ్యాచ్‌లో రెండు మార్పులు చేశామని, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగుతున్నారని చెప్పాడు.

దాంతో అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాల్లో ఆడుతున్నారని తెలిపాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఎడమ తొడ కండరాల గాయంతో నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
తుది జట్లు
రెండో వన్డే సందర్భంగా అతనికి ఈ గాయం కాగా.. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తోంది.ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి 2-0తో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. మరోవైపు ఆసీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రేన్‌షా, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: