
సిడ్నీ వేదికగా జరుగుతున్న వన్డేలో భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు కొనసాగింది. మ్యాచ్ కీలక మలుపులో టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యంతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.
అయితే అదే సమయంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.. ఒక వైపు అతని ఫీల్డింగ్ విన్యాసం ప్రశంసలు అందుకోగా, మరో వైపు గాయం కారణంగా అతను తిరిగి బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అన్న సందేహం నెలకొంది.
Cricket: నేటి వన్డేకు నితీశ్ కుమార్ రెడ్డి దూరం..కారణమేంటి
భారత్ టాస్ ఓడి మొదట ఫీల్డింగ్ చేపట్టింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు స్థిరంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు.అయితే, మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ స్కోరు వేగం తగ్గింది. ఈ క్రమంలో హర్షిత్ రాణా (Harshit Rana) వేసిన బౌలింగ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.
నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడిపోయాడు
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి, అద్భుతమైన డైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే, క్యాచ్ పట్టే క్రమంలో అతను నేరుగా పొట్ట భాగంపై బలంగా పడ్డాడు. దీంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానంలోనే పడిపోయాడు. సహచర ఆటగాళ్లు వచ్చి చూసినా నొప్పి తగ్గకపోవడంతో వెంటనే ఫిజియో మైదానంలోకి ప్రవేశించాడు.
ప్రాథమిక చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, శ్రేయాస్‌ను మైదానం బయటకు తీసుకెళ్లారు. నడవలేని స్థితిలో ఉండటంతో ఇద్దరి సాయంతో అతను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: