2025 నార్వే చెస్ (2025 Norway Chess) టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు (Gukesh Dommaraju)చివరి క్షణాల్లో ఓడిపోవడంతో, మాగ్నస్ కార్ల్సన్ మరోసారి విజేతగా నిలిచాడు.పదో రౌండ్‌కి ముందు కార్ల్సన్‌కు కేవలం అర పాయింట్ ఆధిక్యం మాత్రమే ఉంది. ఒకవైపు గుకేశ్, మరోవైపు ప్రపంచ నంబర్ వన్ కార్ల్సన్ మధ్య పోటీ నాటకీయంగా సాగింది. తొమ్మిదో రౌండ్‌లో గుకేశ్ వెయ్ యిపై విజయం సాధించగా, కార్ల్సన్ కరువానాను ఓడించాడు.ఫైనల్ రౌండ్‌లో గుకేశ్‌కు కనీసం డ్రా అవసరం. కానీ, అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాతో తలపడిన గేమ్ చివర్లో గుకేశ్ ఒత్తిడిలో భారీ తప్పిదం చేశాడు. టైమ్ ప్రెషర్‌లో ఒక నైట్ ఫోర్క్‌కు చిక్కి, గేమ్‌ను కోల్పోయాడు.
ఒక తప్పిదం.. టోర్నీ ఆశలు ఛేదం
గేమ్ అనంతరం గుకేశ్ ఆవేదనకు లోనయ్యాడు. ఒక్క తప్పిదంతో టైటిల్ దూరమవడం ఆయనను తీవ్రంగా బాధించింది. గేమ్ చివర్లో మిగిలిన కొన్ని సెకన్ల వ్యవధిలో తీసుకున్న ఆ నిర్ణయం అతనికి చుక్కలు చూపించింది.ఫైనల్ రౌండ్‌కు ముందు కార్ల్సన్ మాట్లాడుతూ గుకేశ్‌తో జరిగిన గేమ్‌లో ఓటమిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. “ఆ గేమ్ వల్ల నా టోర్నమెంట్ కలలు భగ్నమయ్యాయి” అని అన్నాడు. అయినప్పటికీ, చివరికి టైటిల్‌ను అతనే దక్కించుకోవడం గమనార్హం.
చెస్ ప్రపంచంలో భారత్‌కు గర్వకారణమైన గుకేశ్
గేమ్ ఓడిపోయినా, గుకేశ్ ప్రదర్శన అభినందనీయమైనది. అతడి ఆట శైలి, నైపుణ్యం ప్రపంచ చెస్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇదే స్ఫూర్తితో గుకేశ్ మరింత బలంగా తిరిగి రావాలని భారత చెస్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
Read Also : Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు