
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా (Harshit Rana) తనపై వస్తున్న విమర్శలకు ప్రతిఘటిస్తూ అద్భుతమైన ప్రదర్శనతో గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో హర్షిత్ రాణా 39 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Read Also: T20 2025: ఆసీస్‌తో టీ20 సిరీస్..భారత జట్టు ఇదే?
ఈ మ్యాచ్ అనంతరం, ఓ వికెట్ పడగొట్టేందుకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma)ఇచ్చిన సలహా ఎలా పనిచేసిందో వెల్లడించి ఆసక్తి రేపాడు.ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, జోష్ హేజిల్‌వుడ్‌ల వికెట్లను రాణా పడగొట్టాడు.
వీరిలో మిచెల్ ఓవెన్ వికెట్ తనకెంతో ప్రత్యేకమని, దాని వెనుక ఓ ఆసక్తికర కథ ఉందని చెప్పాడు. “కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నన్ను స్లిప్ ఫీల్డర్ కావాలా అని అడిగాడు. నేను అవసరం లేదని చెప్పాను.
ఆయనను స్లిప్‌లో ఫీల్డింగ్ చేయమని
కానీ, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ భాయ్.. ‘ఏయ్, స్లిప్ పెట్టు, నన్ను వెళ్లనివ్వు’ అని గట్టిగా చెప్పాడు. దాంతో సరేనని ఆయనను స్లిప్‌లో ఫీల్డింగ్ చేయమని కోరాను. ఆ తర్వాతి బంతికే వికెట్ పడింది. వెంటనే రోహిత్ భయ్యాకు థాంక్స్ చెప్పాను” అని హర్షిత్ (Harshit Rana)వివరించాడు.
ఆ వికెట్ పడిన వెంటనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన వైపు చూస్తూ ‘స్లిప్ పెట్టమని చెప్పాను కదా’ అన్నట్లుగా సైగ చేశాడని ప్రజెంటర్ నవ్వుతూ గుర్తుచేశాడు. ఈ ఘటనతో, ప్రస్తుత కెప్టెన్ గిల్ వ్యూహాల కన్నా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవానికి హర్షిత్ ఎక్కువ విలువిచ్చినట్లు స్పష్టమవుతోంది.జియోస్టార్ ‘క్రికెట్ లైవ్’ కార్యక్రమంలో తన బౌలింగ్ ప్రణాళికల గురించి హర్షిత్ మాట్లాడుతూ..
సరైన ఏరియాల్లో బంతులు వేయడంపైనే దృష్టి
“ఈ రోజు నా బౌలింగ్ రిథమ్ చాలా బాగుంది. ఆరంభంలో నేను అటాక్ చేయడానికి ప్రయత్నించలేదు. సరైన ఏరియాల్లో బంతులు వేయడంపైనే దృష్టి పెట్టాను. కొత్త బంతితో వెంటనే వికెట్లు రాకపోయినా, అది నా ప్రణాళికలో భాగమే. లైన్ అండ్ లెంగ్త్‌పై దృష్టి సారించడం ఫలించింది.
నేను అభివృద్ధి చేసుకుంటున్న అవుట్‌స్వింగర్‌ను కూడా సరిగ్గా అమలు చేయగలిగినందుకు సంతోషంగా ఉంది” అని తెలిపాడు. మొత్తం మీద, ఈ ప్రదర్శనతో హర్షిత్ రాణా జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: