हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Gautam Gambhir: అతడికి సపోర్టు గా నేనున్నా: గంభీర్

Anusha
Latest News: Gautam Gambhir: అతడికి సపోర్టు గా నేనున్నా: గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌లో భారత జట్టు ఎదుర్కొన్న ఓటమిపై గంభీర్ స్పందిస్తూ, ఆ పరాజయం తనను జీవితాంతం వెంటాడుతుందని చెప్పాడు.

IND vs WI: టీమిండియా భారీ స్కోర్

సొంత నేలపై ఆడినప్పటికీ ఆ మ్యాచ్‌ను కోల్పోవడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారిందని పేర్కొన్నాడు. “ఆ ఓటమిని మర్చిపోవడం అసాధ్యం. నేను నా ఆటగాళ్లకు కూడా ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ఓటములు జట్టును మరింత బలంగా తయారు చేస్తాయి” అని గంభీర్ (Gautam Gambhir) అన్నారు.

రాహుల్ ద్రవిడ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా బాథ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం గంభీర్ హెడ్ కోచ్‌గా ఘోర పరాజయాలను చవిచూసాడు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే

అతని పర్యవేక్షణలో టీమిండియా (Team India) సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఈ పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది.

వెస్టిండీస్‌ (West Indies) తో రెండో టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట లంచ్ బ్రేక్‌లో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన గంభీర్.. డబ్ల్యూటీసీ ఛాంపియన్‌ (WTC Champion) గా నిలవాలంటే విదేశాల్లో కూడా రాణించాలని చెప్పాడు.’వరల్డ్ బెస్ట్ టెస్ట్ టీమ్‌గా ఎదగాలంటే సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ ఆధిపత్యం కనబర్చాలనేది నా ఆలోచన.

Gautam Gambhir
Gautam Gambhir

సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయిస్తే సరిపోతుందనే

ఈ యువ జట్టు ఆ ఆలోచనను అమలు చేసింది. అత్యంత కఠినమైన ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా అనుభవం లేని మా యువ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫలితం ఎలా ఉన్నా.. ప్రతీ రోజు మా ఆటగాళ్లు పోరాడిన తీరు అద్భుతం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయిస్తే సరిపోతుందనే సిద్దాంతాన్ని నేను నమ్మను. ఎందుకంటే సొంతగడ్డపై మాత్రమే రాణిస్తే.. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌‌గా నిలిచేందుకు ఏ మాత్రం అర్హులు కారు. కోచ్‌గా న్యూజిలాండ్ (New Zealand) చేతిలో ఎదురైన పరాజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

పదే పదే మా ఆటగాళ్లకు గుర్తు చేస్తూ

ఆ ఓటమిని మర్చిపోకూడదు కూడా. ఈ ఓటమిని మా ఆటగాళ్లకు పదే పదే గుర్తు చేయాలి. ఓటమిని మరిచి ముందుకు వెళ్లడం ముఖ్యమే. కానీ కొన్నిసార్లు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతాన్ని మర్చిపోతే తేలికగా తీసుకోవడం మొదలుపెడుతారు.

దేనిని కూడా తేలికాగా తీసుకోకూడదు. ఎందుకంటే న్యూజిలాండ్‌ను మేం సునాయసంగా ఓడిస్తామని అంతా అనుకున్నారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. ఇదే వాస్తవం. ఆట అంటేనే ఇలా ఉంటుంది. నన్నుఅడిగితే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో పదే పదే మా ఆటగాళ్లకు గుర్తు చేస్తూ ఉండాలని చెబుతాను.

అందుకే మేం ప్రత్యర్థిని ఇంచ్‌ కూడా తేలికగా తీసుకోం. ప్రతికూల పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ఎలా రియాక్ట్ అవుతాడో అని నాకు చూడాలని ఉంది. అతనికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అతనిపై ఈగ కూడా వాలనివ్వను. విమర్శలను స్వీకరించేందుకు నేను సిద్దంగా ఉన్నాను. అతను సరైన డైరెక్షన్‌లో నడిచే వరకు అండగా ఉంటాను.’అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

రేపే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

IPL రిటైర్మెంట్‌‌కి అసలు కారణం చెప్పిన రస్సెల్

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

అత్యధికంగా ఇంటర్నెట్‌లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై హర్భజన్ ఫైర్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా స్టార్క్

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ కు అశ్విన్ ఫిదా

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

రెండో వన్డే విజయం.. సౌతాఫ్రికా కెప్టెన్ స్పందన ఇదే!

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

జెరుసలేం మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న అర్జున్ ఇరిగేశీ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మోహిత్ శర్మ

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా

📢 For Advertisement Booking: 98481 12870