టీమ్ ఇండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుని ప్రపంచ వేదికపై భారత గర్వాన్ని మరోసారి నింపింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత భారత మహిళా క్రికెటర్లపై అభినందనల వర్షం కురుస్తోంది. క్రీడా ప్రేమికులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నాయకులు అందరూ ఈ జట్టును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఐసీసీ ప్రకటించిన బహుమతి ప్రకారం విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది. ఈ విజయం కేవలం ట్రోఫీ పరిమితం కాకుండా ఆర్థికపరమైన గౌరవాన్ని కూడా తెచ్చిపెట్టింది.
Fee Reimbursement Colleges Bandh : నేటి నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్
ఇక రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా (SA) జట్టుకు రూ.19.77 కోట్లు ప్రైజ్ మనీగా దక్కనుంది. టోర్నమెంట్ మొత్తం సజావుగా సాగిన తీరు, ఆటగాళ్ల నిబద్ధత, పోటీ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఐసీసీ ఈసారి మహిళా క్రికెట్లో ప్రైజ్ మనీని గణనీయంగా పెంచడం కూడా గమనార్హం. ఈ ప్రపంచకప్ భారత మహిళా క్రికెట్‌కు మైలురాయిగా నిలిచింది. ప్రపంచ క్రీడా రంగంలో మహిళల స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టిన ఈ ఘనత భవిష్యత్ తరాల మహిళా ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తోంది.

అంతేకాక, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్ల అదనపు బోనస్‌తో కలిపి మొత్తం భారత మహిళా జట్టుకు సుమారు రూ.93.66 కోట్ల వరకు అందే అవకాశం ఉంది. ఇందులో ప్రైజ్ మనీతో పాటు బోనస్‌లు, పార్టిసిపేషన్ ఫీజులు కూడా ఉన్నాయి. ఈ భారీ మొత్తంతో టీమ్ ఇండియా ఆటగాళ్లకు గౌరవం మాత్రమే కాదు, మరింత ఉత్సాహం కూడా లభించనుంది. ఇది భారత క్రీడా చరిత్రలో అత్యధిక ఆర్థిక బహుమతిగా నిలవనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విజయంతో “ఉమెన్స్ ఇన్ బ్లూ” గ్లోబల్ స్టేజ్‌పై కొత్త ప్రమాణాలు సృష్టించి, దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/