हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి

Aanusha
Latest News: Sri Charani: నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: శ్రీచరణి

టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆల్‌రౌండర్ నల్లపురెడ్డి శ్రీచరణి (Sri Charani) తన ఆరాధ్య క్రికెటర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమెలో క్రికెట్‌పై ఉన్న ప్యాషన్‌కి ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరని అడిగినప్పుడు, ఆమె దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) పేరు ప్రస్తావించింది. “యువీ అన్నయ్యే నా ఇన్‌స్పిరేషన్. ఆయన ఆడిన ప్రతి మ్యాచ్ నాకు గుర్తుంది. ముఖ్యంగా 2007లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన ఆ క్షణం నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనిది” అని శ్రీచరణి తెలిపింది.

Read Also: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టులో నల్లపు రెడ్డి శ్రీచరణి (Sri Charani) కీలక సభ్యురాలు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అద్వితీయమైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. అత్యుత్తమ ప్రదర్శన(3/41).

దీప్తి శర్మ(19) తర్వాత భారత తరఫున సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచింది.ప్రత్యర్థికి పరుగులివ్వకుండా కట్టడి చేయడం శ్రీచరణి ప్రత్యేకత. ఫైనల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా శ్రీచరణిపైనే ఆధారపడింది. ఒక ఎండ్‌లో శ్రీ చరణితో కట్టడిగా బౌలింగ్ చేయించి.. మరో ఎండ్‌లో వికెట్ల కోసం హర్మన్ ప్రయత్నించింది.

ఒత్తిడి లేకుండా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో

సౌతాఫ్రికా బ్యాటర్ బోష్‌ను శ్రీ చరణి డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన తీరు అద్భుతం. 21 ఏళ్ల వయసులోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసిన శ్రీ చరణి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీ చరణి తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో చెప్పింది.

Sri Charani
Sri Charani

యువరాజ్ సింగ్‌తో పాటు స్మృలి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా తన ఫేవరేట్ క్రికెటర్లని తెలిపింది. ‘క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్, స్మృతి మంధాన, హర్మన్‌, జెమీమా అంటే నాకు చాలా ఇష్టం. యువరాజ్‌ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వీడియో అయితే ఇప్పటివరకు ఓ లక్ష సార్లు చూడొచ్చు. ఎప్పటికైనా యువరాజ్‌ సింగ్‌లా సిక్సర్లు కొట్టాలనేది నా కోరిక.

శ్రీచరణి అనూహ్యంగా క్రికెట్‌‌వైపు అడుగులు

ప్రస్తుతానికైతే బౌలింగ్‌ పైనే ఫోక్‌స పెట్టాను. జట్టు అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తాను.’అని చెప్పుకొచ్చింది.ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి అనూహ్యంగా క్రికెట్‌‌వైపు అడుగులు వేసింది. ఆమె జీవిత ప్రయాణం గురించి వింటే ప్రపంచకప్ గెలిపించడానికే ఆమె క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుందా అనిపిస్తోంది.

శ్రీ చరణి తొలుత ఖోఖోలో జాతీయస్థాయిలో రాణించింది. అథ్లెటిక్స్‌లోనూ అవకాశం అందుకుంది. కానీ పదోతరగతి చదువుతున్న సమయంలో క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకుంది. ముందుగా తన నిర్ణయాన్ని తండ్రి చంద్రశేఖర రెడ్డి, తల్లి రేణుక వ్యతిరేకించారు. కానీ కూతురు పట్టుదల చూసి ఆ దిశగా ప్రోత్సహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870