ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కీలకమైన పేసర్ జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు దూరమవడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఆయన, గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమయ్యారు. గత కొన్నేళ్లుగా పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు, తాజాగా చీలమండ నొప్పి జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) ని వేధిస్తున్నాయి. దీంతో టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరడం కష్టంగా మారింది. హాజిల్‌వుడ్ టెస్టులకు వీడ్కోలు పలికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగితే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా తనలో ఇంకా మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని హాజిల్‌వుడ్ పేర్కొన్నారు.
Read Also: Arjuna Ranatunga : చమురు కుంభకోణం కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: