భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్(Haseen Jahan) మరోసారి వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె తనకు నెలకు ఇచ్చే రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, దానిని రూ.10 లక్షలకు పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును(The Supreme Court) ఆశ్రయించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.
Read Also: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక

జహాన్ (Haseen Jahan)నిర్ణయంపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమెను విమర్శిస్తూ “విడాకుల తర్వాత మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకు? సొంత కాళ్లపై నిలబడటమే స్త్రీ స్వావలంబన కాదా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం “భరణం అనేది వ్యక్తి జీవన స్థాయి, పిల్లల అవసరాలు, ఖర్చుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అది భర్త ఆదాయంతో సంబంధం ఉండకూడదు” అని అభిప్రాయపడుతున్నారు.
లీగల్ నిపుణుల ప్రకారం, కోర్టు భరణం మొత్తం నిర్ణయించే సమయంలో భర్త, భార్యల ఆర్థిక స్థితి, పిల్లల బాధ్యతలు, జీవన ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో హసీన్ జహాన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ అనంతరం తుది నిర్ణయం వెలువడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: