
హర్యానా (Haryana) రాష్ట్రంలోని రోహ్‌తక్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది..ఓ యువ ప్లేయర్, బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పోల్ విరిగిపడడంతో, గ్రౌండ్ లోనే దుర్మరణం పాలయ్యాడు.
Read Also: Smriti Mandhana: ఆసుపత్రి నుంచి స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్
వివరాల్లోకి వెళితే
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. (Haryana) రోహ్ తక్ కు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ లఖన్ మజ్రా (16) బాస్కెట్ బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాస్కెట్ బాల్ హూప్‌ను పట్టుకొని వేలాడుతుండగా పోల్ విరిగి అతడి మీద పడింది.
అక్కడే ఉన్న ఇతర క్రీడాకారులు వెంటనే లఖన్ ను పోల్ కింది నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: