గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ఓటమిని చవిచూసింది. క్రికెట్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్న ఈ మ్యాచ్‌లో ముంబయి ఆటగాళ్లు తుది నిమిషాల్లో దెబ్బతిన్నారు. ప్రత్యర్థి జట్టు పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో అద్భుతంగా రాణించడంతో ముంబయి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

హార్దిక్ పాండ్య భావోద్వేగం – కెప్టెన్‌గా బాధ్యతా భావం
మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ప్టెన్ హార్దిక్ పాండ్య సహా జట్టు సభ్యులు విచారంలో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని పాండ్య మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం పాండ్య ఈ వ్యాఖ్యలు చేశాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని అయ్యర్ పరుగులు రాబట్టాడని చెప్పాడు. తమ జట్టు మంచి స్కోరే చేసినప్పటికీ బౌలింగ్ యూనిట్ అనుకున్నంతగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజారిందని అన్నాడు.
శ్రేయస్ అయ్యర్ వీరత్వం – మ్యాచ్ ముంచిన ఇన్నింగ్స్
ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు. సిక్సర్ తో జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. అంటే ఏకంగా 68 పరుగులు ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే సాధించాడు. కాగా, ఈ ఓటమితో ముంబయి ఇంటిముఖం పట్టింది.
ఫైనల్ సమరానికి పంజాబ్ – బెంగళూరుతో తలపడనుంది
మంగళవారం అదే అహ్మదాబాద్ వేదికపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనున్న పంజాబ్, శ్రేయస్ అయ్యర్ ఫామ్ కొనసాగితే టైటిల్‌కు ప్రధాన బలంగా మారనుంది. ఐపీఎల్‌లో ఎన్నో విజయాలు అందుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తక్కువ స్థాయిలో నిలవలేదు. కానీ కీలక సమయాల్లో ప్రదర్శన తగ్గిపోవడం ఓటమికి దారితీసింది.
Read also: Dinesh Karthik : గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం