టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మరోసారి వార్తల్లో నిలిచారు. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తరువాత, హార్దిక్ నటి, మోడల్ మహియెకా శర్మ (Mahieka Sharma) తో డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వేళ మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను స్టార్ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Read Also: Ruturaj Gaikwad: రుతురాజ్ పై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు
హార్దిక్–మహియెకా దివాళీ ఫోటోలు వైరల్
కుమారుడు అగస్త్య, మహియెకాతో ఉన్న ఫొటోలను హార్దిక్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో ఓ వీడియోలో వీరిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అందులో ప్రియురాలి బుగ్గపై మార్దిక్ ముద్దు పెడుతూ ఎంతో సంతోషంగా కనిపించాడు. ఈ ఫొటోలు దివాళీ వేడుకలవిగా తెలుస్తోంది. మరో ఫొటోలో జిమ్‌లో మహియెకాను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చాడు హార్దిక్.
ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నటాషాతో విడిపోయిన తర్వాత హార్దిక్ బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా కొద్ది రోజులు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే, మహియెకా శర్మ (Hardik Pandya) తో డేటింగ్ రూమర్స్ మొదటగా ‘రెడిట్’ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభమయ్యాయి. ఆమె షేర్ చేసిన సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన వ్యక్తి హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు గుర్తించడం గమనార్హం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: