టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టు, సమతుల్యంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. (Harbhajan Singh) అయితే ఈ జట్టులో యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కు (Shubman Gill) చోటు దక్కకపోవడం తనకు కాస్త బాధ కలిగించిందని ఆయన వెల్లడించాడు. ఈ విషయాన్ని హర్భజన్ ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. శుభ్‌మన్‌కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించడాన్ని హర్భజన్ సమర్థించాడు.
Read also: Women’s T20: టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్.. సదర్లాండ్ నంబర్ వన్

సవాళ్లను స్వీకరించడానికి గిల్ సిద్ధంగా ఉన్నాడు
సవాళ్లను స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. గిల్ పునరాగమనంపై తనకు ఏమాత్రం సందేహం లేదని అన్నాడు. (Harbhajan Singh) టీమిండియా కోరుకునే కాంబినేషన్ వల్లే టీ20 ఫార్మాట్‌లో అతడు స్థానం పొందలేకపోయాడని అన్నాడు. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో అతడి సారథ్యంలో జట్టు బాగా ఆడుతుందని, అలాగే న్యూజిలాండ్‌తో సిరీస్‌ను కూడా టీమిండియా సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్న వాళ్లంతా మ్యాచ్ విన్నర్లేనని అన్నాడు.
మనం వరుసగా ప్రపంచకప్‌లు గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని, మనకు అలాంటి జట్టు ఉందని చెప్పాడు.జట్టులో స్పిన్ బౌలర్ల కూర్పు కూడా చాలా బాగుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తమ స్పిన్‌తో మ్యాచ్‌లను గెలిపించగలరని అన్నాడు. బ్యాటర్లు ఇప్పటికీ వరుణ్ చక్రవర్తి స్పిన్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారని, కుల్‌దీప్ యాదవ్ బౌలింగులో వైవిధ్యం ఉంటుందని అన్నాడు. స్పిన్ కాంబినేషన్ చక్కగా ఉందని, వారు గాయాల పాలవకుండా చాలాకాలం పాటు టీమిండియాకు సేవలందించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: