(Karnataka) బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం (Karnataka) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్ శుక్రవారం ప్రకటించారు. బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. “బెంగళూరు నగరం ప్రతిష్ఠను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం.
Read Also: Vinesh Phogat: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్

భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి జి. పరమేశ్వర పర్యవేక్షిస్తారు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం” అని శివకుమార్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి జి. పరమేశ్వర పర్యవేక్షిస్తారని, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, పోలీసు అధికారులతో చర్చించి తుది ప్రణాళికను సిద్ధం చేస్తారని వివరించారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చిన్నస్వామి స్టేడియం ఏ సంవత్సరం ప్రారంభించబడింది?
చిన్నస్వామి స్టేడియం 1969 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి అధికారికంగా ప్రారంభించబడింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: