हिन्दी | Epaper

Latest News: Shubhman Gill: రోహిత్‌ను పలికరించిన గిల్

Aanusha
Shubhman Gill
Shubhman Gill

టీమిండియా వన్డే క్రికెట్‌ కెప్టెన్సీ మార్పు తర్వాత మొదటిసారి ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) , మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పబ్లిక్‌గా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే ముందు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఎదురుపడ్డారు. గిల్, రోహిత్‌ను చూసి హర్షంగా పలకరించగా, రోహిత్ కూడా చిరునవ్వుతో స్పందిస్తూ “అరె గిల్… ఎట్లున్నావ్ బ్రదర్?” అంటూ హాస్యభరితంగా ఆత్మీయంగా పలకరించాడు. ఆ క్షణం అక్కడ ఉన్న ఇతర ఆటగాళ్లను, అభిమానులను ఆకట్టుకుంది.

Read Also: Virat Kohli: ఆర్‌సీబీ కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా?

ఈ వీడియోను ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. “ఇదే నిజమైన టీమ్ స్పిరిట్‌”, “ఇదే కెప్టెన్, మాజీ కెప్టెన్‌ల బంధం”, “క్యూటెస్ట్ వీడియో” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ఇద్దరూ ఒకరినొకరు గౌరవంగా చూసుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. భారత ఆటగాళ్లంతా ఢిల్లీ విమానాశ్రయంలోనే కలుసుకున్నారు. ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. ఈ సిరీస్‌లో టీమిండియాను శుభ్‌మన్ గిల్ నడిపించనుండగా..కోహ్లీ, రోహిత్‌లు అతని సారథ్యంలో ఆడనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్
3:25

‘ధురంధర్ 2’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్
0:43

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ట్రైలర్‌ టీజ్‌ రిలీజ్

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం
2:46

మద్యం మత్తులో యువకుడి మృతి.. అంతిమయాత్రలో ఏసీపీ భావోద్వేగం

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు
0:30

హైదరాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ గుట్టురట్టు

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!
0:15

జేపీఎన్ రోడ్డులోని ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు!

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..
0:54

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ భేటీ..

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల
0:52

వింత.. బీర్ బాటిల్‌లో చేప పిల్ల

📢 For Advertisement Booking: 98481 12870