టీమిండియా వన్డే క్రికెట్‌లో పెద్ద మార్పులకు దారితీసిన నిర్ణయం గురించి మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుండి తప్పించడం వెనుక ఉన్న అసలు కారణం గురించి మాట్లాడుతూ, ఇది బీసీసీఐ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అని స్పష్టం చేశారు.
వన్డే ప్రపంచకప్ 2027 (2027 World Cup) ఆడే విషయంపై క్లారిటీ లేకపోవడంతోనే టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
BCCI: దేశవాళీ క్రికెట్ లో విరాట్, రోహిత్ ఆడాల్సిందే.. బోర్డు స్పష్టం
భవిష్యత్తులో బ్యాడ్ న్యూస్ వినేందుకు అభిమానులు సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. అంతర్జాతీయ వన్డేల షెడ్యూల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే ప్రపంచకప్ 2027 ఆడటం సందేహంగా మారిందని చెప్పాడు.తాజాగా ఓ జాతీయ స్పోర్ట్స్ ఛానెల్ (National Sports Channel) తో మాట్లాడిన గవాస్కర్.. కోహ్లీ, రోహిత్ (Virat, Rohit)వన్డే ప్రపంచకప్ 2025 ఆడాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని చెప్పాడు.
‘వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో రోహిత్ శర్మ ఆడుతాడో లేదో తెలియదు. ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్యాలెండర్‌ను చూస్తే.. భారత జట్టు ఎక్కువగా వన్డేలు ఆడే అవకాశం లేదు. ద్వైపాక్షిక పర్యటనల్లో ఎక్కువగా టెస్ట్‌లు, టీ20లు ఉన్నాయి.ఏడాదికి 5-7 వన్డేలు మాత్రమే ఆడితే.. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీకి కావాల్సిన ప్రాక్టీస్ లభించదు.

గిల్‌ను సారథిగా సిద్దం చేయాలని
జట్టులో అతని స్థానంపై స్పష్టత లేకపోవడంతోనే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ను సారథిగా సిద్దం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు ఆలోచనే ఇది. వ్యక్తిగతంగా రోహిత్ చాలా సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌ను గెలిపించాడు. అతని కెప్టెన్సీ గురించి మరో ఆలోచన లేదు. కానీ అతను కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాడు.
ఎందుకంటే మెగా టోర్నీకి ఓ యువ సారథిని సిద్దం చేయడం కీలకం. సెలెక్షన్ కమిటీ ఇదే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంది.కోహ్లీ, రోహిత్ నిబద్దత చూపకపోతే.. వచ్చే రెండేళ్లలో మరిన్ని బ్యాడ్ న్యూస్ వినేందుకు సిద్దంగా ఉండాలి. కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగాలంటే కోహ్లీ, రోహిత్ విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ని ఆడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు వన్డే ప్రపంచకప్ 2027 ఆడే విషయంపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు రోహిత్ కు అన్యాయం జరిగిందని అంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: