సంజూ శాంసన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. గంభీర్ (Gautam Gambhir) మద్దతు లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని స్పష్టం చేశాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో తన విజయానికి గంభీర్ చేసిన సహకారం ఎంతో ఉందని తెలిపాడు.టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ విజయం సాధించిన తర్వాత, రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఈ నిర్ణయం తర్వాత టీమిండియాలో ఓపెనర్ స్థానం ఖాళీ అవ్వడంతో, ఆ అవకాశం సంజూ శాంసన్ (Sanju Samson) కు వచ్చింది. అయితే ఆరంభ మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన అస్సలు సంతృప్తికరంగా లేకపోయింది. వరుసగా కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే ఔటవడంతో, చాలా మంది విమర్శలు గుప్పించారు.అసాధారణ బ్యాటింగ్‌తో తన సత్తా చాటాడు.
నా దగ్గరకు వచ్చి ఏమైంది? అని అడిగాడు
లంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. గంభీర్ చెప్పిన మాటలను నెమరు వేసుకున్నాడు.నేను డ్రెస్సింగ్ రూమ్ (Dressing room) లో దిగాలుగా కూర్చోవడాన్ని గంభీర్ గమనించాడు. నా దగ్గరకు వచ్చి ఏమైంది? అని అడిగాడు. నాకు వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాను. పరుగులు చేయలేకపోయానని అన్నాను. అయితే ఏమైంది? అని గంభీర్ ప్రశ్నించాడు. నువ్వు 21 సార్లు డకౌట్ అయినా తుది జట్టు నుంచి తప్పించను. స్వేచ్చగా బ్యాటింగ్ చేయాలని చెప్పాడు.కోచ్, కెప్టెన్ ఇలా సపోర్ట్‌గా నిలబడితే ఏ ఆటగాడి ఆత్మవిశ్వాసమైనా రెట్టింపు అవుతుంది.

అండగా నిలిచాడు
వాళ్లు మనపై నమ్మకం ఉంచి సక్సెస్ కోరుకుంటారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు అండగా నిలిచాడు. దులీప్ ట్రోఫీ సందర్భంగా వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడిస్తానని సూర్యకుమార్ యాదవ్ హామీ ఇచ్చాడు. అన్నట్లే సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో అవకాశాలు ఇచ్చాడు. రెండు శతకాలతో అతని నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. గంభీర్ మద్దతు ఆసియా కప్ 2025లోనూ కొనసాగుతుందని ఆశిస్తున్నాను.’అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
గౌతమ్ గంభీర్ క్రికెట్ కెరీర్‌లో ప్రధాన విజయాలు ఏమిటి?
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 97 పరుగులు, 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 75 పరుగులు సాధించారు. భారత్ తరఫున టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అనేక అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
గౌతమ్ గంభీర్ ఏ జట్లకు ఆడారు?
దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున, IPLలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: