టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తాజాగా చేసిన వ్యాఖ్యలు, రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల వన్డే భవిష్యత్తుపై జరుగుతున్న చర్చలకు స్పష్టతనిచ్చాయి. క్రికెట్‌లో వయస్సు కంటే ఆటగాళ్ల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ అభిప్రాయపడ్డారు. ఆటగాడు మంచి ఫామ్‌లో ఉంటే, వయస్సు ఒక్కటి కారణంగా అతన్ని పక్కన పెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్నలు – గంభీర్ స్పందన
ఇటీవలి వన్డే వరల్డ్ కప్ (one World Cup) తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్ల భవిష్యత్తుపై సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ (Gautam Gambhir) ను విలేకరులు ఆ ప్రశ్నపై స్పందించాలని అడగ్గా, ఆయన ధీరంగా మాట్లాడుతూ, “ఆటగాళ్లు ఫిట్‌గా ఉంటే, ఫామ్‌లో ఉంటే, వయస్సు పెద్ద సమస్య కాదు”(Age not big issue) అని తేల్చిచెప్పారు.
2027 ప్రపంచ కప్‌నకు ఇంకా చాలా సమయం ఉందని,ప్రస్తుతం భారత జట్టు దృష్టి 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైనే ఉందన్నది. వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందున, దాని గురించి ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం లేదని గంభీర్ అభిప్రాయపడ్డారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: