క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో పేలవ ఫామ్ కొనసాగించిన టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెడ్ కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 408 రన్స్ తేడాతో ఇండియా ఓటమి పాలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గంభీర్ (Gautam Gambhir)స్పందిస్తూ తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు.
Read Also: Rishabh Pant: ఓటమిపై పంత్ ఏమన్నారంటే?
క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు
93 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా వరుసగా రెండో ఏడాది సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. గంభీర్ పర్యవేక్షణలోనే టీమిండియా ఈ రెండు ఘోర పరాజయాలను చవిచూసింది. గతేడాది ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన సౌతాఫ్రికా.. తొలిసారి సొంతగడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసింది.

ఈ ఘోర పరాజయం తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌ను హెడ్ కోచ్‌గా తన భవితవ్యంపై ప్రశ్నించగా సూటిగా సమాధానమిచ్చాడు. ‘హెడ్ కోచ్‌గా నేను కొనసాగేది లేనిది బీసీసీఐ నిర్ణయించాల్సిన విషయం. నేను గతంలోనే చెప్పాను. భారత క్రికెట్ కంటే ఎవరూ ముఖ్యం కాదు.
ఓటమికి జట్టులోని ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందే
అది నేనైనా ఎవరైనా, అయితే కోచ్‌గా నేను ఇంగ్లండ్‌లో ఫలితాలు సాధించాను. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచిన వ్యక్తిని నేనే. ఈ జట్టు నేర్చుకునే దశలో ఉంది. కుర్రాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి.ఈ ఓటమికి జట్టులోని ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందే. అందరూ నిందను ఎదుర్కోవాల్సిందే. అది నా నుంచే మొదలవుతుంది.
ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి బయటపడాలంటే.. టెస్ట్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రాధాన్యత ఇవ్వాలి. సమష్టిగా రాణించడంపై కృషి చేయాలి. ఆటగాళ్లను లేదా ఒక వ్యక్తిని నిందించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: