టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి ప్రశంసల వర్షంలో తడిశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రోహిత్ నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ, “అతను నిజమైన కెప్టెన్, జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచిన నాయకుడు” అని వ్యాఖ్యానించాడు.
Steve Harmison: అగార్కర్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ హెచ్చరిక
రోహిత్ సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, “ఆ విజయాల వెనుక రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వమే ప్రధాన శక్తి” అని గంగూలీ అన్నారు (Sourav Ganguly).
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు బాగుందని తెలిపాడు. ఇది అద్భుతమైన జట్టు అని, ఆటగాళ్లందరూ బాగా ఆడుతారని చెప్పాడు.వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ను నయా సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వాదన
దాంతో కోహ్లీ, రోహిత్ వన్డే ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. రోహిత్, కోహ్లీలు మాత్రం వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027) లక్ష్యంగా సన్నదమవుతున్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన గంగూలీని కెప్టెన్సీ మార్పు గురించి ప్రశ్నించగా.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మ అనుమతితోనే కెప్టెన్సీ మార్పు చేశారని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు బాగుందన్నాడు. మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s ODI World Cup) లో భారత్ అద్భుతంగా ఆడుతుందని, బిగ్ మ్యాచ్‌లు ముందున్నాయని చెప్పాడు.’రోహిత్ శర్మ అద్భుతమైన సారథి. కెప్టెన్‌గా అతను టీ20 ప్రపంచకప్ 2025తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచాడు.
ఎంపిక చేసిన జట్టు సొంతంగా
ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టు సొంతంగా ఎంచుకున్నది. ఆటగాళ్లందరూ బాగా ఆడుతారు. అందుకే వారికి అవకాశం దక్కింది. జట్టు బాగుంది. కెప్టెన్సీ (Captaincy) మార్పుపై కచ్చితంగా రోహిత్ శర్మకు సమాచారమిచ్చి ఉంటారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.రోహిత్ శర్మ ప్రదర్శనతో వచ్చే సమస్య ఏం లేదు.
2027లో రోహిత్ 40 ఏళ్లకు చేరుకుంటాడు. క్రీడల్లో అది పెద్ద సంఖ్యే. కెప్టెన్సీ కోల్పోవడం సహజమే. ఇది నాకు జరిగింది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతీ ఒక్కరు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: