ఆసియా కప్ దగ్గరపడుతుండగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ (India-Pakistan match) హైప్లో ఉంది. కానీ, మ్యాచ్‌కి సంబంధించి సోనీ స్పోర్ట్స్ రిలీజ్ (Sony Sports Release) చేసిన ప్రోమో ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.ఈ నెలల కిందటే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అదే పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి ప్రోమో చేసినందుకు అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.సోషల్ మీడియాలో (#BoycottAsiaCup, #ShameOnSonySports) అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. బాధితుల కుటుంబాలను అవమానపరిచేలా ఉంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రకటనలో భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కనిపించడంతో అతనిపైనా విమర్శలు మొదలయ్యాయి. ‘‘మనదే విజయం’’ అనే ఆయన వ్యాఖ్యలు నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురిచేశాయి.
సెహ్వాగ్ ధీమా: ‘‘ఆసియా కప్ మనదే’’
ప్రచారంలో భాగంగా సెహ్వాగ్ మాట్లాడుతూ, “మేము వరల్డ్ ఛాంపియన్లు. టీ20, ఛాంపియన్స్ ట్రోఫీ మనదే. ఆసియా కప్ కూడా మనదే అవుతుంది” అన్నారు.భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై సెహ్వాగ్ పొగడ్తలతో ముంచెత్తారు. “అతడి నాయకత్వం అద్భుతం. జట్టు బలంగా ఉంది. మనం గెలవడమే,” అని స్పష్టం చేశారు.ఈసారి ఆసియా కప్ కోసం భారత్ గ్రూప్ ‘ఏ’లో పోటీ పడుతుంది. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్ దేశాలతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో భారీ పోరు ఉంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో గ్రూప్ మ్యాచ్ ముగుస్తుంది.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టులో గిల్లు, హార్దిక్, తిలక్ వర్మ, బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో బ్యాలెన్స్ బాగుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.
జట్టులో ప్రధాన ఆటగాళ్లు
బ్యాట్స్‌మెన్: సూర్యకుమార్, గిల్, తిలక్ వర్మ
ఆల్‌రౌండర్లు: హార్దిక్, శివమ్ దూబే, అక్షర్
బౌలర్లు: బుమ్రా, చక్రవర్తి, అర్ష్‌దీప్, కుల్దీప్
వికెట్ కీపర్స్: జితేశ్, సంజూ శాంసన్
రిజర్వ్స్: హర్షిత్ రాణా, రింకూ సింగ్
ఫ్యాన్స్: క్రికెట్‌కు మద్దతే, కానీ గౌరవం ముందే
అభిమానులు ఈ వివాదంపై తమ స్పష్టమైన అభిప్రాయం చెబుతున్నారు. ‘‘మేము క్రికెట్‌ను ప్రేమిస్తాం. కానీ, భావోద్వేగాలను గౌరవించాలి’’ అంటున్నారు. ప్రోమో తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత దుమారానికి కారణమైన ఈ ప్రకటనపై సోనీ స్పోర్ట్స్ ఇప్పటివరకు స్పందించలేదు. అభిమానులు స్పందన కోసం వేచి ఉన్నారు. ఈ వివాదం ఆసియా కప్‌కు ముడిపడి ఉండటం గమనార్హం.
Read Also :