हिन्दी | Epaper
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. షూటింగ్‌ వరల్డ్‌కప్‌ లో సురుచి విజయం KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ..

Latest News: Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

Anusha
Latest News: Messi: మెస్సితో ఫొటో దిగాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సిందే?

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi).. హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.13వ తేదీన సింగరేణి ఆర్‌ఆర్‌-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఇందులో సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్‌ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతారు.రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ 20 నిమిషాల పాటు జరుగుతుంది, మ్యాచ్‌ చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్‌, సాకర్‌ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారు.

Read Also: IND Vs SA: నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20

సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్‌కి వస్తారు

అయితే ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ వస్తున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Messi) తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.. ఇది ఫ్రీ ఫొటో కాదు. రూ.10 లక్షలు చెల్లిస్తే మెస్సీతో ఫొటో దిగే అవకాశం ఉంది. అది కూడా అందరికీ కాదు. కేవలం వంద మందికి మాత్రమే.

దీని గురించి ‘ద గోట్‌ టూర్‌’ హైదరాబాద్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకటన చేశారు. పార్వతి రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 13, శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్‌ (Hyderabad) కి వస్తారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. గంట పాటు అక్కడే ఉంటారు. అలానే ఫలక్‌నామా ప్యాలెస్‌లో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. ఆ సమయంలో ఆయనతో ఫొటో దిగేందుకు అవకాశం ఉంది.

Do you have to pay Rs. 1 million to take a photo with Messi?
Do you have to pay Rs. 1 million to take a photo with Messi?

డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి

ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలతో పాటు జీఎస్టీ కలిపి మొత్తం 10 లక్షల రూపాయలు చెల్లించాలి. కేవలం వంద మందికి మాత్రమే మెస్సీతో ఫొటో దిగేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు డిస్ట్రిక్ట్ యాప్‌ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకోవచ్చు అని తెలిపారు.15 మంది చిన్నారులు ఈ మ్యాచ్‌లో పాల్గొనబోతుండగా వీరిలో 5గురు ట్రైనింగ్ పొందిన వారు కాగా.. మిగతా 10 మంది టాలెంట్ ఉండి శిక్షణకు దూరమైన పిల్లలు ఉంటారు.

ఆ తర్వాత ఫుట్‌బాల్ క్లినిక్ ఉంటుంది. దీనిలో భాగంగా మెస్సీ.. చిన్నారులకు ఫుట్‌బాల్‌ ఎలా ఆడాలి.. ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి.. ఏమేం నేర్చుకోవాలి అనే చిట్కాలు చెబుతారు. అలానే మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూటౌట్‌ కూడా నిర్వహిస్తారు. గెలిచిన వారికి మెస్సి బహుమతులు ఇస్తారు. అనంతరం నిర్వహించే పరేడ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy).. మెస్సీని సన్మానిస్తారు.

ఈ క్రమంలో సుమారు గంట పాటు మెస్సీ ఉప్పల్‌ స్టేడియంలో ఉంటారు. శనివారం రాత్రి మెస్సీ హైదరాబాద్‌లోనే బస చేసి.. ఆదివారం ఉదయం ముంబైకి వెళ్తారని పార్వతిరెడ్డి తెలిపారు. మెస్సీ హైదరాబాద్ టూర్‌కి సంబంధించి.. డిస్ట్రిక్ట్ యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870