
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సైతం పెళ్లంటే నిప్పుతో చెలగాటమని చెబుతూ నవ్వులు పూయించాడు. ప్రపంచకప్ గెలిచినా.. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ అయినా భార్యల ముందు సాధారణ భర్తేనని స్పష్టం చేశాడు. ఓ వివాహ వేడుకలో ధోనీ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వధూవరులకు ధోనీ (MS Dhoni) కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశాడు.
Read Also: WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదల
ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి ఒకటే
వరుడిని ఉద్దేశిస్తూ, “పెళ్లి చేసుకోవడం చాలా మంచి విషయం. కానీ, నువ్వు చాలా తొందరపడ్డావు. కొంతమందికి నిప్పుతో చెలగాటం ఆడటం ఇష్టం. ఉత్కర్ష్ (వరుడు) కూడా అలాంటి వాడే” అని ధోనీ అనడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. అనంతరం భర్తలందరినీ ఉద్దేశించి, “నా భార్య వేరు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి ఒకటే.
మనం వరల్డ్ కప్ గెలిచామా? లేదా? అన్నదానితో సంబంధం లేదు” అంటూ చమత్కరించాడు.ఇక వధువుకు సలహా ఇస్తూ, “భర్తకు కోపం వస్తే ఏమీ మాట్లాడకండి. ఐదు నిమిషాల్లో వాళ్లే చల్లబడతారు. మా బలం మాకు తెలుసు” అని చెప్పి నూతన దంపతులను ఆశీర్వదించాడు. ఈ వీడియో పాతదా? లేక కొత్తదా? అనే దానిపై స్పష్టత లేదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: