భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఈ నెల 9వ తేదీన అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీ(CricketAcademy) ఏర్పాటు అంశంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
Read Also: Mohammed Shami: క్రికెటర్ మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు..

రాష్ట్రంలో యువ క్రికెటర్లకు మెరుగైన శిక్షణ, మౌలిక వసతులు కల్పించడంతో పాటు, గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ అకాడమీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. క్రికెట్(CricketAcademy) రంగంలో ధోనికి ఉన్న అనుభవం, నాయకత్వ నైపుణ్యాలను రాష్ట్రానికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ భేటీకి ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ధోని పర్యటనతో రాష్ట్ర క్రీడారంగానికి కొత్త ఊపిరి వచ్చే అవకాశం ఉందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: